Online Puja Services

హిమాలయాలు చేసిన శివ స్తోత్రం.

18.119.248.159

హిమాలయాలు చేసిన శివ స్తోత్రం. | Shiva Stotram by Himalayas | Lyrics in Telugu

ఈశ్వరుడు సదా నివసించే హిమాలయ పురుషుడు చేసిన శివస్తోత్రం ఇది. సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అయిన పరమేశ్వరుని ఈ స్తోత్రంతో ప్రతి రోజూ త్రిసంధ్యలలో పూజిస్తే, కనీసం ఈ స్తోత్రాన్ని చదువుకుంటే, జన్మసార్థకమైయ్యే ఉపలబ్ధితో పాటు ఐహికమైన సౌభాగ్యాలన్నీ కూడా ఒనగూరుతాయి. వివాహంకానివారికి వివాహము , సంతానం కోరుకొనేవారికి సంతానం, రాజ్య భ్రష్టుడై ఉన్నవారికి రాజ్యం,  దుష్టశక్తులు, శత్రుబాధలు ఉన్నవారికి వాటినుండీ విముక్తి కలుగుతుంది. వీటన్నింటికీ మించి శంకర సాన్నిధ్యం, జన్మ సాయుజ్యం లభిస్తాయి. చాలా సులువుగా ఎవరైనా నేర్చుకొని చక్కగా పారాయణ చేసుకోదగిన ఈ దివ్యమైన స్తోత్రం బ్రహ్మవైవర్తన మహా పురాణం లోని శ్రీ కృష్ణ జన్మ ఖండంలో పొందుపరచబడి ఉంది.   ఆ దివ్యమైన స్తోత్రాన్ని చదువుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.    


హిమాలయ ఉవాచ ॥

త్వం బ్రహ్మా సృష్టికర్తా చ త్వం విష్ణుః పరిపాలకః ।
త్వం శివః శివదోఽనంతః సర్వసంహారకారకః ॥1॥

త్వమీశ్వరో గుణాతీతో జ్యోతీరూపః సనాతనః
ప్రకృతః ప్రకృతీశశ్చ ప్రాకృతః ప్రకృతేః పరః ॥2॥

నానారూపవిధాతా త్వం భక్తానాం ధ్యానహేతవే ।
యేషు రూపేపు యత్ప్రీతిస్తత్తద్రూపం బిభర్షి చ ॥3॥

సూర్యస్త్వం సృష్టిజనక ఆధారః సర్వతేజసాం ।
సోమస్త్వం సస్యపాతా చ సతతం శీతరశ్మినా ॥4॥

వాయుస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిః సర్వదాహకః ।
ఇంద్రస్త్వం దేవరాజశ్చ కాలో మృత్యుర్యమస్తథా ॥ 5॥

మృత్యుంజయో మృత్యుమృత్యుః కాలకాలో యమాంతకః ।
వేదస్త్వం వేదకర్తా చ వేదవేదాంగపారగః ॥ 6॥

విదుషాం జనకస్త్వం చ విద్వాంశ్చ విదుషాం గురుః ।
మంత్రస్త్వం హి జపస్త్వం హి తపస్త్వం తత్ఫలప్రదః ॥ 7॥

వాక్ త్వం రాగాధిదేవీ త్వం తత్కర్తా తద్గురుః  స్వయం ।
అహో సరస్వతీబీజం కస్త్వాం స్తోతుమిహేశ్వరః॥8॥

ఇత్యేవముక్త్వాశైలేంద్రస్తస్థౌ ధృత్వా పదాంబుజం ।
తత్రోవాస తమాబోధ్య చావరుహ్య వృషాచ్ఛివః ॥ 9॥ 

స్తోత్రమేతన్మహాపుణ్యం త్రిసంధ్యం యః పఠేన్నరః ।
ముచ్యతే సర్వపాపేభ్యో భయేభ్యశ్చ భవార్ణవే ॥ 10॥

అపుత్రో లభతే పుత్రం మాసమేకం పఠేద్యది ।
భార్యాహీనో లభేద్భార్యాం సుశీలాం సుమనోహరాం ॥ 11॥ 

చిరకాలగతం వస్తు లభతే సహసా ధ్రువం ।
రాజ్యభ్రష్టో లభేద్రాజ్యం శంకరస్య ప్రసాదతః ॥ 12॥

కారాగారే శ్మశానే చ శత్రుగ్రస్తేఽతిసంకటే ।
గభీరేఽతిజలాకీర్ణే భగ్నపోతే విషాదనే ॥ 13॥

రణమధ్యే మహాభీతే హింస్రజంతుసమన్వితే ।
సర్వతో ముచ్యతే స్తుత్వా శంకరస్య ప్రసాదతః ॥ 14॥

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే హిమాలయకృతం శివస్తోత్రం సంపూర్ణం ||

 

 

 

Shiva, Siva, Stotram, Himalayas, 

Quote of the day

God can be realized through all paths. All religions are true. The important thing is to reach the roof. You can reach it by stone stairs or by wooden stairs or by bamboo steps or by a rope. You can also climb up by a bamboo pole.…

__________Ramakrishna